తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పై మంత్రి కెటిఆర్ కీలక వ్యాఖ్యలు
- September 12, 2023
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కెటిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. అక్టోబర్ 10వ తేదీ లోపు నోటిఫికేషన్ వస్తేనే నిర్ణీత సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని చెప్పారు. ఈ లోగా నోటిఫికేషన్ రావడం అనుమానమే అన్నారు. అలా జరిగితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ లేదా మే నెలలో జరిగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తీసుకునే నిర్ణయం తర్వాత అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు.
దేశవ్యాప్తంగా కొద్ది రోజులుగా జమిలి ఎన్నికలపై చర్చ సాగుతోన్న విషయం తెలిసిందే. ఎన్నికల ఖర్చు, ప్రజలకు ఇబ్బంది తగ్గించే ఉద్దేశ్యంలో భాగంగా జమిలి ఎన్నికల వైపు నరేంద్ర మోడీ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో కెటిఆర్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









