చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ మంగళవారానికి వాయిదా
- September 13, 2023
అమరావతి: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతోపాటు ఈ నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరపు లాయర్లు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటషన్ పై విచారణ హైకోర్టులో ప్రారంభమయింది. ఈ కేసులో చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని ఆయన తరపున వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టును కోరారు. మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును అరెస్ట్ చేసే ముందు రాష్ట్ర గవర్నర్ అనుమతి తీసుకోలేదని ఆయన చెప్పారు.
చంద్రబాబు పై విచారణ ప్రాథమిక దశలో ఉందని ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని ఏఏజీ పొన్నవోలు కోర్టును కోరారు. ఈ క్రమంలో ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. ఇరువైపుల వాదనలను పూర్తిగా వినాల్సి ఉందని చెప్పింది. కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని పొన్నవోలు కోరారు. దీంతో, తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేస్తున్నామని, ఆలోగా కౌంటర్ వేయాలని ఆదేశించింది. అయితే సీఐడీ కస్టడీకి చంద్రబాబును ఇవ్వొద్దని కోర్టును లూథ్రా కోరారు. ఆయన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు… వచ్చే సోమవారం వరకు చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ







