త్వరలో భారత్ కు చేరుకోనున్న సీ–295
- September 14, 2023
న్యూఢిల్లీ: భారత వాయుసేన అమ్ముల పొదిలో కొత్త యుద్ధ విమానాలు వచ్చి చేరనున్నాయి. తొలి విమానం శుక్రవారం స్పెయిన్ నుంచి మన దేశానికి చేరుకోనుంది. ఈమేరకు బుధవారం స్పెయిన్ లోని సెవెల్లేలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌధురి తొలి సీ–295 విమానాన్ని స్పెయిన్ అధికారుల నుంచి అందుకున్నారు. అందులో కాసేపు ప్రయాణించి విమానం పనితీరును పరీక్షించిన చౌధురి మాట్లాడుతూ.. సీ–295 యుద్ధ విమానాల కొనుగోలుకు స్పెయిన్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. మొత్తం 56 విమానాలకు రూ.22 వేల కోట్లతో డీల్ కుదిరిందని, ఇందులో 16 విమానాలను 2025లోగా స్పెయిన్ తయారు చేసి ఇస్తుందని వివరించారు.
మిగతా 40 యుద్ధ విమానాలను గుజరాత్ లోని వడోదరలో తయారు చేయడానికి టీఏఎస్ఎల్ కంపెనీతో స్పెయిన్ కంపెనీ డీల్ కుదుర్చుకుందని తెలిపారు. కాగా, వడోదరలో 2024 నవంబర్ లో ఈ విమానాల తయారీ ప్రారంభం కానుందని తెలిపారు. సీ–295 యుద్ధ విమానం చేరికతో భారత వాయుసేన మరింత పటిష్ఠం అవుతుందన్నారు. ఈ విమానంలో ఒకేసారి 71 మంది జవాన్లను లేదంటే 50 మంది పారాట్రూపర్లను సరిహద్దులకు తరలించవచ్చని వివరించారు. వాయుసేన చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని ఎయిర్ చీఫ్ మార్షల్ అభిప్రాయపడ్డారు. సీ–295 విమానం శుక్రవారం స్పెయిన్ నుంచి ఇండియాకు బయలుదేరనుందని చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









