ఉదయ్ కిరణ్ చిత్రం మళ్లీ ఆగింది
- June 25, 2015
ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన చివరి సినిమా 'చిత్రం చెప్పిన కథ'. 'నువ్వునేను' ఫేమ్ అనిత ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో డింపుల్, గరిమ, మదాలస శర్మ ఇతర పాత్రల్లో నటించారు. మున్నా చిత్ర నిర్మాత. మోహన్ ఏయల్లార్కే దర్శకుడు. ఉదయ్ కిరణ్ నటించిన ఈ చివరి చిత్రం.... రెండు సంవత్సరాలుగా వివిధ కారణాలతో విడుదలకు నోచుకోలేదు. ఉదయ్ కిరణ్ తొలి జయంతి రోజే ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని అనుకున్నారు కానీ అప్పట్లో వీలు కాలేదు. తాజాగా జూన్ 26న ఉదయ్ కిరణ్ 2వ జయంతి సందర్భంగా ఆయన చివరి జ్ఞాపకం అయిన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం ఈ సారి కూడా విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఈ చిత్రాన్ని ఆపాలంటూ సిటీ సివిల్ కోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఉదయ్ కిరణ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఆటంకాలు ఏర్పడటం వల్ల ఉదయ్ కిరణ్ ఆత్మ శాంతిస్తుందా? అని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ...ఈ సినిమాకు ఉదయ్ కిరణ్, మున్నా, స్క్రిప్ట్ రైటర్ నరేష్ చాలా కష్టపడ్డారు. ఈ సినిమాను పెద్ద హిట్ చేసి ఉదయ్ కిరణ్‌కి నివాళి ఇవ్వాలనుకున్నాం. ఆయన ఉన్నపుడు సినిమా విడుదలై ఉంటే మంచి హిట్టై ఉదయ్ కిరణ్ కి మంచి పేరు తీసుకొచ్చి ఉండేది. ఇపుడు తను మన మధ్య లేకపోవడం బాధాకరం అన్నారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









