బిగ్‌బాస్: రెండో ఇంటి సభ్యుడ్ని కన్ఫామ్ చేసేందుకు షాకింగ్ టాస్క్.!
- September 16, 2023
క్రేజీ గేమ్ షో బిగ్‌బాస్ ఏడో సీజన్ ఈ సారి కాస్త ఆసక్తికరంగానే సాగుతోందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇంతవరూ 14 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘ఉల్టా ఫుల్టా’ అంటూ ప్రచారం చేసిన ఈ షోలో ఇంతవరకూ జరిగినట్టుగా అస్సలు జరగదనీ, అంతా కొత్తగా వుంటుందనీ, ఏది అనుకుంటే దానికి రివర్స్‌లోనే జరుగుతుందని హోస్ట్ నాగార్జున ప్రమోట్ చేశారు.
అందులో భాగంగానే ఇంతవరకూ ఇంట్లో వున్న 14 మంది కన్ఫామ్ కంటెస్టెంట్లు కాదని చెప్పారు. గత వారం సందీప్ మొదటి సభ్యుడిగా ఎంపికయ్యాడు. ఈ వారం రెండో సభ్యుడి కోసం టాస్కులు జరుగుతున్నాయ్. ఆ పోటీలో శివాజీ, షకీలా, అమరదీప్ పోటీ పడుతున్నారు.
పోటీ అయితే ముగిసింది. ఫైనల్ డెసిషన్ మాత్రం శనివారం వీకెండ్ ఎపిసోడ్లో నాగ్ కన్ఫామ్ చేస్తారు. ఈ గెలుపుతో హౌస్‌లో రెండో సభ్యుడిగా కన్ఫామ్ అవ్వడంతో పాటూ, నాలుగు వారాలు ఇమ్యూనిటీ.. ఆల్రెడీ నామినేషన్లో వుంటే, సేఫ్ అవ్వడం జరుగుతుంది విన్ అయిన కంటెస్టెంట్.
ఆ ఛాన్స్ శివాజీ, షకీలా, అమరదీప్లలో ఎవరికి వస్తుందో తెలియాలంటే వీకెండ్ ఎపిసోడ్ బిగ్‌బాస్ వీక్షించాల్సిందే.!
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్‌లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







