సైమా అవార్డ్స్ వేడుకలో మెరిసిన తారలు..రెండవ రోజు
- September 17, 2023
దుబాయ్: సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్ట్స్–2023 (SIIMA) వేడుక దుబాయ్ లో అట్టహాసంగా జరుగుతోంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ వేడుక దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 15వ తేదీన ఘనంగా ప్రారంభమైంది. మొదటిరోజు తెలుగు, కన్నడ స్టార్స్ హాజరుకాగా.. రెండో రోజు మలయాళీ, తమిళ స్టార్స్ కమల్ హాసన్, ఎస్ జె సూర్య, కుంచకో బోబన్, ప్రదీప్ రంగనాథం, లెఒకేష్ కనగరాజ్ త్రిష కృష్ణన్, మణిరత్నం, కళ్యాణి ప్రియదర్శిని, ఆర్ మాధవన్, జోనిత గాంధీ, వినీత్ శ్రీనివాసన్ సహా పలువురు స్టార్స్ పాల్గొని సందడి చేశారు.
కాగా, 2023 సంవత్సరానికి గానూ ఉత్తమ నటుడిగా మలయాళంలో టోవినో థామస్ ఈ అవార్డును అందుకున్నారు. తల్లుమాల సినిమాకు గానూ టోవినో థామస్ కు ఈ అవార్డు వరించింది. ఇక ఉత్తమ నటిగా మలయాళంలో కళ్యాణి ప్రియదర్శిని బ్రో డాడీ సినిమాకు అవార్డు అందుకుంది.
2023 సంవత్సరానికి గానూ ఉత్తమ నటుడిగా తమిళంలో కమల్ హాసన్ అవార్డును అందుకున్నారు. విక్రమ్ సినిమాకు గానూ కమల్ హాసన్‌కు ఈ అవార్డు వరించింది. ఇక పోన్నియన్ సెల్వన్ చిత్రానికి గానూ తమిళంలో ఉత్తమ నటిగా త్రిష అవార్డు అందుకుంది.ఈ ఈవెంట్ కి మీడియా పార్టనర్ గా మాగల్ఫ్.కామ్,హోస్ట్ పార్టనర్ గా Truckers వ్యవహరించాయి.
మలయాళం సైమా అవార్డ్స్ -2023 విజేతలు..
ఉత్తమ నటుడు : టోవినో థామస్ (తల్లుమాల)
ఉత్తమ నటి : కళ్యాణి ప్రియదర్శిని (బ్రో డాడీ)
ఉత్తమ దర్శకుడు : వినీత్ శ్రీనివాసన్ (హృదయం)
ఉత్తమ చిత్రం : నా తాన్ కేసు కోడు
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : కుంచకో బోబన్ (నా తాన్ కేసు కోడు)
ఉత్తమ నటి (క్రిటిక్స్) : దర్శన రాజేంద్రన్ (హృదయం)
ఉత్తమ విలన్: వినీత్ శ్రీనివాసన్ (ముకుందన్ ఉన్ని అసోసియేట్స్)
ఉత్తమ లిరిక్ రైటర్ : వినాయక్ శశికుమార్ (భీష్మ పర్వం)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : శరణ్ వేలాయుధన్ (సౌదీ వెల్లక్క)
ఉత్తమ నేపథ్య గాయని : మృదుల వారియర్ (మయిల్పీలి)
ఉత్తమ పరిచయ నటుడు : రంజిత్ సజీవ్ (మైక్)
ఉత్తమ పరిచయ నటి : గాయత్రీ శంకర్ (నా తాన్ కేసు కోడు)
ఉత్తమ పరిచయ దర్శకుడు: అభినవ్ సుందర్ నాయక్ (ముకుందన్ ఉన్ని అసోసియేట్స్)
ఉత్తమ సహాయ నటి : బిందు పనికర్(రోర్స్చాచ్)
ఉత్తమ సహాయ నటుడు : లాల్ (మహావీర్యార్)
ఉత్తమ హాస్య నటుడు : రాజేష్ మాధవన్ (నా తాన్ కేసు కోడు)
ప్రత్యేక జ్యూరీ అవార్డు : బాసిల్ జోసెఫ్ (జయ జయ జయ జయ హే)
తమిళ్ సైమా అవార్డ్స్ -2023 విజేతలు..
ఉత్తమ నటుడు : కమల్ హాసన్ (విక్రమ్ )
ఉత్తమ నటి : త్రిష కృష్ణన్ (పొన్నియిన్ సెల్వన్-1)
ఉత్తమ దర్శకుడు : లోకేష్ కనగరాజ్ (విక్రమ్ )
ఉత్తమ చిత్రం : పొన్నియిన్ సెల్వన్ – 1
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) ఆర్ మాధవన్ (రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్)
ఉత్తమ నటి (క్రిటిక్స్) : కీర్తి సురేష్ (సాని కాయిదం)
ఉత్తమ విలన్: ఎస్.జె.సూర్య (డాన్)
ఉత్తమ సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్(విక్రమ్ )
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్-1)
ఉత్తమ పరిచయ నటుడు : ప్రదీప్ రంగనాథన్ (లవ్ టుడే)
ఉత్తమ పరిచయ నటి : అదితి శంకర్ (విరుమాన్)
ఉత్తమ పరిచయ దర్శకుడు: ఆర్ మాధవన్ ( రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్)
ఉత్తమ సహాయ నటి : వాసంతి (విక్రమ్)
ఉత్తమ సహాయ నటుడు : కాళీ వెంకట్ (గార్గి)
ఉత్తమ పరిచయ నిర్మాత : గౌతం రామచంద్రన్ (గార్గి)
ఉత్తమ హాస్య నటుడు : యోగి బాబు (లవ్ టుడే)
ఎక్స్ట్రార్డినరీ అచీవ్మెంట్ అవార్డు : మణిరత్నం
ఉత్తమ నేపథ్య గాయకుడు – : కమల్ హాసన్ ‘విక్రమ్’ (పాతాళ పాతాల)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ : తోట తరణి (పొన్నియిన్ సెల్వన్-1)





తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







