340 మంది అవినీతి అనుమానితులను విచారించిన నజాహా
- September 17, 2023
రియాద్: సౌదీ అరేబియా అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) సఫర్ 1445 AH నెలలో 3,452 తనిఖీలను నిర్వహించింది. ఈ క్రమంలో 340 మంది అవినీతి అనుమానితులను విచారించినట్లు తెలిపింది. విచారించిన వారిలో నిందితుల్లో ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, అంతర్గత, రక్షణ, న్యాయ, ఆరోగ్యం, విద్య, మునిసిపల్, గ్రామీణ వ్యవహారాలు, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ, అలాగే జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) నుండి ఉద్యోగులు ఉన్నారని నజాహా వెల్లడించింది. సుమారు 134 మంది పౌరులు, నివాసితులను అరెస్ట్ చేసినట్లు తెలిపింది. పరిపాలనా అవినీతికి సంబంధించిన ఏదైనా అనుమానాస్పద చర్యను టోల్-ఫ్రీ నంబర్: 980, ఇమెయిల్: [email protected], ఫ్యాక్స్: 114420057 ద్వారా నివేదించాలని నజాహా కోరింది.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







