చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాజ్‌ఘాట్ వద్ద లోకేశ్ సహా టీడీపీ ఎంపీలు మౌనదీక్ష

- September 19, 2023 , by Maagulf
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాజ్‌ఘాట్ వద్ద లోకేశ్ సహా టీడీపీ ఎంపీలు మౌనదీక్ష

చంద్రబాబు అరెస్టును నిరసిస్తు ఢిల్లీలోని రాజ్‌ఘాట్ ఉన్న గాంధీజీ సమాధి వద్ద టీడీపీ ఎంపీలు నివాళులు అర్పించారు. నారా లోకేశ్ తో పాటు టీడీపీ ఎంపీలు అందరు మహాత్మాగాంధీ సమాధికి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడే కూర్చుని నల్లబ్యాడ్జీలతో మౌనదీక్ష పాటిస్తు నిరసన వ్యక్తంచేశారు. నారా లోకేశ్ తో పాటు టీడీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు, ఇంకా ఇతర టీడీపీ ముఖ్య నేతలు మౌన దీక్ష పాటించారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఎంపీ రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్,మురళీ మోహన్,కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని నాని, మురళీ మోహన్, కొనకళ్ల నారాయణతో పాటు పలువురు టీడీపీ నేతలు ఈ దీక్షలో పాల్గొన్నారు. వీరితో పాటు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా పొల్గొన్నారు.

కాగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటులో అవినీతి జరిగిందని దానికి ప్రధాన సూత్రధాని చంద్రబాబు అనే ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేసింది ఏపీ సీఐడీ. అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టటం ఆ తరువాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ గా తరలించటం జరిగింది. చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు నిసనలు వ్యక్తంచేస్తున్నారు.జాతీయ నేతలు సైతం చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. విదేశాల్లో కూడా చంద్రబాబు అరెస్టుకు నిసననగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com