ఖైరతాబాద్ వినాయకుడిని సందర్శించిన వెంకయ్యనాయుడు
- September 21, 2023
హైదరాబాద్: దైవభక్తితో సాంత్వన కలుగుతుందని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ భారతీయులకు దైవభక్తి, గురుభక్తి మెండు అని అని చెప్పారు. గణపతి నవరాత్రుల వంటి ఉత్సవాల వల్ల దేశ సమైక్యత మరింత పెరుగుతుందన్నారు. దేశం ఎప్పుడూ శాంతిసామరస్యాలతో వర్ధిల్లాలని, భారత్ మరింత శక్తిమంతమైన దేశంగా ఎదగాలని, భారతీయులందరూ సుఖసంతోషాలతో విలసిల్లాలని గణేశుడిని ప్రార్థించినట్లు వెల్లడించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన రాష్ర్టప్రభుత్వాన్ని, ఉత్సవకమిటీని వెంకయ్యనాయుడు అభినందించారు.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







