రష్మిక మండన్నా ‘యానిమల్’.! కొత్తగా సరికొత్తగా.!

- September 27, 2023 , by Maagulf
రష్మిక మండన్నా ‘యానిమల్’.! కొత్తగా సరికొత్తగా.!

రష్మిక మండన్నా ప్రస్తుతం బాలీవుడ్‌లో నటిస్తున్న చిత్రం ‘యానిమల్’. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో పాపులర్ అయిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకి దర్శకుడు. తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సంచలన విజయం అందుకున్న సందీప్ రెడ్డి వంగా.. అదే సినిమాని హిందీలో తెరకెక్కించి అక్కడా సూపర్ సెన్సేషన్ అయిపోయిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత బాలీవుడ్‌లోనే సెటిలైపోయాడు సందీప్ రెడ్డి. ఆయన నుంచి వస్తున్న తాజా చిత్రమే ‘యానిమల్’. రణ్‌వీర్ కపూర్, రష్మిక మండన్నా జంటగా రూపొందుతోన్న ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ రోల్ పోషిస్తున్నారు. 

త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా వుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు షురూ చేసింది చిత్ర యూనిట్. అందులో భాగంగా సినిమాలోని క్యారెక్టర్లను ఒక్కొక్కరుగా పరిచయం చేస్తున్నారు ‘యానిమల్’ టీమ్.

ఈ పరిచయం ఒకింత ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తోంది. ‘యానిమల్’ అసలు సోల్ ఏంటీ.? ఏ కాన్సెప్ట్‌తో రూపొందుతోంది.. అనే అంశంపై అంతకంతకూ ఆసక్తి రేకెత్తుతోంది. 

ప్రతిష్టాత్మకమైన భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో రష్మిక మండన్నా క్యారెక్టర్ చాలా కొత్తగా వుండబోతోందట. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో నిండైన చీరకట్టులో ట్రెడిషనల్‌గా కనిపిస్తోంది రష్మిక మండన్నా. 

ఇంతవరకూ బాలీవుడ్‌లో రష్మిక చేసిన సినిమాలు ఓ ఎత్తు.. ఈ సినిమా ఇంకో ఎత్తు అనేలా వుండబోతోందట. ఈ సినిమా హిట్ అయితే, రష్మిక బాలీవుడ్‌లోనూ స్టార్‌డమ్ సంపాదించుకోవడం పక్కా అంటున్నారు. ఆ స్థాయిలో ఈ సినిమాపై అంచనాలున్నాయ్. చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com