అల్ బురైమిలో 777 విదేశీ కంపెనీల పెట్టుబడి
- October 05, 2023
అల్ బురైమి: ఈ ఏడాది అక్టోబర్ వరకు అల్ బురైమి గవర్నరేట్‌లో విదేశీ పెట్టుబడి కంపెనీల సంఖ్య పెరిగినట్లు ఒమన్ వాణిజ్య, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. 2022లో 177 కంపెనీలతో పోలిస్తే 2023లో ఈ సంఖ్య 777గా ఉండటం విశేషం. అల్ బురైమి గవర్నరేట్‌లోని వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రోత్సాహక శాఖ డైరెక్టర్ హమద్ బిన్ మొహమ్మద్ అల్ సైదీ మాట్లాడుతూ..గవర్నరేట్‌లో విదేశీ పెట్టుబడుల కోసం నమోదు చేయబడిన మూలధనం OMR9 మిలియన్లకు పైగా ఉందని, పారిశ్రామిక సంస్థల సంఖ్య 584 అని చెప్పారు. ఇదిలా ఉండగా అల్ బురైమి గవర్నరేట్‌లో వాణిజ్య రిజిస్ట్రేషన్ల సంఖ్య 923గా ఉంది. ఇందులో వ్యక్తిగత వ్యాపార సంస్థల సంబంధించి 223 వాణిజ్య రిజిస్ట్రేషన్లు, ఏకైక యాజమాన్యానికి చెందిన 363 వాణిజ్య రిజిస్ట్రేషన్లు, ఇతర పరిమిత బాధ్యత కంపెనీలకు చెందిన 303 వాణిజ్య రిజిస్ట్రేషన్లు నమోదు అయ్యాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..









