గన్మెన్ చెంప ఛెళ్లుమనిపించిన టి.హోంమంత్రి
- October 06, 2023
హైదరాబాద్: తెలంగాణ హోమ్ శాఖా మంత్రి మహమూద్ అలీ సహనం కోల్పోయారు. సెక్యురిటీ గార్డ్ పై చేయి చేసుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన సెక్యురిటీ గార్డ్ పై చేయి చేసుకున్నారు. తలసానికి పుట్టిన రోజు వేడుకలకు హాజరైన మహమూద్ ఆలీ…శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రిని ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. తరువాత అక్కడున్న సెక్యురిటీ గార్డ్ తలసానికి ఇచ్చేందుకు ఫ్లవర్ బొకే ఏది అని అడిగారు. ఈక్రమంలోనే అతను తెలీదని చెప్పినట్లుగా కనిపిస్తోంది. దీంతో సహనం కోల్పోయిన మహమూద్ ఆలీ… అగ్రహం వ్యక్తం చేస్తు అతని చెంప చెళ్లుమనిపించారు.
దీంతో అతను నిస్సహాయంగా చూస్తుండిపోయారు. వెనుక ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి బొకే తీసుకుని మంత్రికి అందించారు. కాగా తెలంగాణ తొలి హోంమంత్రి తరువాత మహమూద్ ఆలీ తెలంగాణ రెండవ హోం మంత్రిగా నియమించబడిన విషయం తెలిసిందే.ఈయన ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.
తాజా వార్తలు
- షేక్ ఖలీఫా బిన్ మొహమ్మద్ వివాహాం..కింగ్ హమద్ హాజరు..!!
- అల్-సబాహియాలో లూనా పార్క్ ప్రారంభం..!!
- షినాస్ తీరంలో డ్రగ్స్ కలకలం..ఇద్దరు అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యలను ఖండించిన సౌదీ సహా 14 దేశాలు..!!
- షార్జాలో కొత్త ట్రాఫిక్ లా.. నవంబర్ 1 నుండి అమలు..!!
- ఖతార్లో ఇండియన్ పాస్ పోర్ట్ కోసం న్యూ గైడ్ లైన్స్ జారీ..!!
- దుబాయ్: ప్రవాసాంధ్రులతో రేపు సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్
- ప్రయాణికులకు RTC ఆత్మీయ స్వాగతం!
- అబుదాబీ పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీల్లో సీఎం చంద్రబాబు
- ఏపీ మీదుగా రెండు హై స్పీడ్ రైలు







