షార్జాలో కొత్త ట్రాఫిక్ లా.. నవంబర్ 1 నుండి అమలు..!!
- October 24, 2025
యూఏఈ: నవంబర్ 1 నుండి షార్జాలో కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి రానుంది. మోటార్‌బైక్‌లు, భారీ వాహనాలు మరియు బస్సుల కోసం ప్రత్యేక లేన్‌లను కేటాయించారు. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ఈ నిర్ణయం లక్ష్యం అని షార్జా పోలీస్ జనరల్ కమాండ్ ప్రకటించింది.
కుడి-కుడి లేన్ భారీ వాహనాలు మరియు బస్సుల కోసం కేటాయించగా, మోటారుబైక్ రైడర్ల కోసం ఎడమ ఫాస్ట్ లేన్‌లను ఉపయోగించాలి. వారు నాలుగు లేన్ల రోడ్లలో రైట్ సైడ్ రెండు లేన్‌లలో ప్రయాణించవచ్చు. మూడు లేన్ల రోడ్లపై, వారు ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా మధ్య లేదా రైట్ లేన్‌ను ఉపయోగించవచ్చు. రెండు లేన్ల రోడ్లపై రైట్ లేన్‌ను మాత్రమే ఉపయోగించాలని తెలిపారు.
ట్రాఫిక్ నియంత్రణకు రాడాలను ఉపయోగిస్తున్నట్లు, నిరంతరం ట్రాఫిక్‌ను పర్యవేక్షించడానికి షార్జా స్ట్రీట్ లలో స్మార్ట్ కెమెరా వ్యవస్థలను మోహరించినట్లు పోలీసులు తెలిపారు. భారీ వాహనం తప్పనిసరి మార్గాన్ని పాటించకపోతే 1,500 దిర్హామ్‌లు జరిమానా మరియు 12 ట్రాఫిక్ పాయింట్లను విధిస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు సూచనలను పాటించకపోతే డ్రైవర్లకు 500 దిర్హామ్‌లు జరిమానాను విధిస్తారని షార్జా పోలీసుల జనరల్ కమాండ్ గుర్తుచేసింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?







