7వ తరగతి విద్యార్థి మృతికి సంబంధించిన ఫోటోలు, సమాచారం షేర్ చేయడపై నిషేధం

- October 06, 2023 , by Maagulf
7వ తరగతి విద్యార్థి మృతికి సంబంధించిన ఫోటోలు, సమాచారం షేర్ చేయడపై నిషేధం

దుబాయ్: ఏడో తరగతి చదువుతున్న చిన్నారి మరణానికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదా ఫొటోలను ప్రచురించడాన్ని దుబాయ్ అటార్నీ జనరల్ నిషేధించారు. మృతుడి కుటుంబాన్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ సంఘటనపై తప్పుడు సమాచారం ప్రచారం కావడంతో ఎస్సామ్ ఇస్సా అల్ హుమైదాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. నిషేధంలో అన్ని ప్రింట్, ఆడియో, విజువల్ మరియు సోషల్ మీడియా ఉన్నాయి. ఈ నిర్ణయం సంఘటన గురించి అభిప్రాయాలు లేదా వ్యాఖ్యలను కూడా నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. సున్నితమైన విషయాల గురించి తప్పుడు సమాచారం సమాజంలో భయాందోళనలను ఎలా సృష్టిస్తుందో అటార్నీ-జనరల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com