విమానం హైజాక్ చేస్తామంటూ శంషాబాద్ ఎయిర్‌పోర్టు బెదిరింపు మెయిల్..
- October 09, 2023
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు కు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. విమానం హైజాక్ చేస్తామని బెదిరిస్తూ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెయిల్ రావడంతో అధికారాలు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో దుబాయ్ వెళ్లే ఓ విమానాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆ విమాన సర్వీసును రద్దు చేసి ప్రయాణికులను హోటల్‌కు తరలించారు. మరోవైపు, ఈ బెదిరింపు మెయిల్ ఎవరు పంపించారనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి, వినోద్, రాకేష్ లను అదుపులోకి తీసుకొని ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు. దుబాయ్ మీదుగా ఇరాక్ కు వెళ్తున్న ఈ ముగ్గురితో పాటు తిరుపతిని సెండ్ హాఫ్ ఇవ్వడానికి వచ్చిన మహిళను సైతం అదుపులోకి తీసుకున్నారు.
ఇరాక్ లోని అమెరికాకు సోల్జర్స్ కు చెందిన బేస్ క్యాంపులో పని చేస్తున్నాడు తిరుపతి. తిరుపతికి ఐసీస్ తో లింకులు ఉన్నాయంటూ మెయిల్ లో పేర్కొన్నారు గుర్తు తెలియని వ్యక్తులు. తిరుపతిని పట్టుకోకపోతే దేశానికి మరో బిగ్ డే అవుతుందంటూ మెయిల్ చేశారు గుర్తు తెలియని వక్తులు. ఈ తరుణంలోనే.. తిరుపతిని సెండ్ హాఫ్ ఇవ్వడానికి వచ్చిన మహిళను సైతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!
- క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!
- అనుమతి లేకుండా ఫిల్మింగ్..వ్యక్తికి Dh30,000 ఫైన్..!!
- ఎయిర్ ఇండియా నిర్ణయంపై కేరళ ప్రవాసుల ఆందోళన..!!
- ఒమానీ-సౌదీ ఉమ్మడి సైనిక వ్యాయామం..!!
- GCC ఆర్థిక ఐక్యతకు బహ్రెయిన్ కృషి..!!
- ఇంట్లో నకిలీ మద్యం తయారీ..మహిళా అరెస్టు..!!
- డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!
- యూదుల ప్రార్థనామందిరం పై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి
- క్రిప్టో క్రైమ్..6ఏళ్ల జైలు, BD105,000 జరిమానా..!!