లులు అతిపెద్ద ఇన్-మాల్ హైపర్‌మార్కెట్ ప్రారంభం
- October 10, 2023
దుబాయ్: రిటైల్ మేజర్ లులు గ్రూప్ సోమవారం దుబాయ్ మాల్లో ఒక శాఖను ప్రారంభించింది. ఇది మిలియన్ల మంది సందర్శకులను అలరించడానికి 72,000 చదరపు అడుగుల స్థలంలో ఏర్పాటు చేశారు. కొత్త అవుట్లెట్ తో దుబాయ్‌లో గ్రూప్ స్టోర్ల సంఖ్య 24కి చేరింది. లులు గ్రూప్ యొక్క అతిపెద్ద ఇన్-మాల్ హైపర్ మార్కెట్ లో ప్రధానంగా కిరాణా, తాజా ఆహారం, పండ్లు,కూరగాయలు, బేకరీ, ఆరోగ్యం, అందం, స్టేషనరీ, గృహ, IT ఉత్పత్తులు, తాజా పువ్వులు మొదలైనవి అందుబాటులో ఉంటాయి. లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ సమక్షంలో యూఏఈ విదేశీ వాణిజ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ థానీ బిన్ అహ్మద్ అల్ జెయోదీ హైపర్ మార్కెట్‌ను ప్రారంభించారు. సెప్టెంబర్‌లో బహ్రెయిన్‌లో 10వ హైపర్‌మార్కెట్‌ను, కువైట్‌లో 15వ హైపర్‌మార్కెట్‌ను ప్రారంభించింది. అలాగే బిలియన్ల దిర్హామ్‌ల పెట్టుబడితో భారతదేశంలో మెగా విస్తరణను కూడా ప్రకటించింది.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..