సెల్ ఫోన్ డ్రైవింగ్ కు Dh800 జరిమానా.. కెమెరాలు, రాడార్లు ఎలా గుర్తిస్తాయంటే?

- October 10, 2023 , by Maagulf
సెల్ ఫోన్ డ్రైవింగ్ కు Dh800 జరిమానా.. కెమెరాలు, రాడార్లు ఎలా గుర్తిస్తాయంటే?

యూఏఈ: దుబాయ్‌లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్‌లను ఉపయోగించే వాహనదారులు పోలీసు పెట్రోలింగ్‌లు లేదా అధికారులను చూసినప్పుడు వాటిని వెంటనే పక్కన పెట్టేయడం తరచుగా గమనించవచ్చు. అయితే, దుబాయ్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానా విధించేది అధికారులు మాత్రమే కాదు. నేరస్థులను గుర్తించి జరిమానా విధించేందుకు దుబాయ్ పోలీసులు సాంకేతికత, రాడార్లు మరియు నిఘా కెమెరాలను ఉపయోగిస్తున్నారు. పోలీసులు ఇటీవల షేర్ చేసిన వీడియోలో డ్రైవింగ్ లో ఉండగా ఫోన్‌ల వినియోగాన్ని కెమెరాలు ఆటోమేటిక్‌గా ఎలా గుర్తిస్తాయో చూపించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరాలు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవారిని, సోషల్ మీడియాను బ్రౌజ్ చేస్తున్న వారిని డ్రైవర్‌లపై జూమ్ ఇన్ చేస్తాయి. ట్రాఫిక్ జంక్షన్లు, మలుపులు మరియు క్రాసింగ్‌ల వద్ద ఉల్లంఘించిన వారిని పట్టుకోవడం వీడియోలో స్పష్టంగా చూపెట్టారు. దుబాయ్‌లోని రాడార్‌లు కేవలం వేగవంతమైన ఉల్లంఘనలను పట్టుకోవడంతోపాటు 2020 నుంచి ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేస్తున్నాయి. మొబైల్ ఫోన్ వినియోగం, అక్రమ లేన్ మార్పులు, ఇతర ట్రాఫిక్ వైఫల్యం వంటి వాటిని గుర్తిస్తున్నాయి. డ్రైవింగ్‌లో ఫోన్‌ను ఉపయోగిస్తే 800 దిర్హామ్ జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్‌పై నాలుగు బ్లాక్ పాయింట్లు విధించబడతాయి.   గత ఎనిమిది నెలలుగా సెల్ ఫోన్ డ్రైవింగ్ కారణంగా 99 ప్రమాదాలు జరగ్గా ఆరుగురు చనిపోయారని తెలిపారు. ఈ కాలంలో పోలీసులు 35,527 ఉల్లంఘనలను నమోదు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com