ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం: 1,500 మందికి పైగా మృతి
- October 10, 2023
యూఏఈ: గాజా స్ట్రిప్‌లో హమాస్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి ఇప్పుడే ప్రారంభమైందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఇది మరింత ఉధృతం అవుతుందని ప్రకటించారు. ఇజ్రాయెల్ ఆదివారం అధికారికంగా హమస్ పై యుద్ధం ప్రకటించింది. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఇజ్రాయెల్‌లో 900 మంది, గాజాలో 680 మందికి పైగా మరణించారు. మొత్తంగా ఈ భీకర దాడుల్లో 1,500 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. మరోవైపు పౌరులపై దాడులను ఆపాలని ఇజ్రాయెల్‌కు యూఏఈ సహా అరబ్ దేశాలు కోరాయి. ఇదిలా ఉండగా.. పాలస్తీనా హమాస్ చేజిక్కించుకున్న గాజా సరిహద్దు కంచె ప్రాంతాలను ఇజ్రాయెల్ తిరిగి స్వాధీనం చేసుకుంది. అయితే, ఆ ప్రాంతంలో భారీగా మందుపాతరలను అమర్చుతున్నట్లు ప్రధాన సైనిక ప్రతినిధి మంగళవారం తెలిపారు. సోమవారం నుండి గాజా నుండి కొత్తగా చొరబాట్లు నమోదు కాలేదని వెల్లడించారు. మరోవైపు ఇజ్రాయెల్ 300,000 మంది రిజర్వ్ ఫోర్స్ ను రంగంలోకి దించింది. గాజా స్ట్రిప్‌పై దిగ్బంధనాన్ని విధించింది. కాగా, ఇజ్రాయెల్ బాంబు వేసిన ప్రతిసారీ ఇజ్రాయెల్ బందీని ఉరితీస్తామని హమాస్ సాయుధ విభాగం ఎజ్జెడిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- గోల్డ్ రూల్స్..క్లారిటీ కోరిన యూఏఈలోని ఇండియన్ కమ్యూనిటీ..!!
- ఖతార్ పై ఇజ్రాయెల్ దాడిని తప్పుబట్టిన UNSC..!!
- ముబారకియా మార్కెట్లో 20 దుకాణాలు మూసివేత..!!
- ఇన్సూరెన్స్ కంపెనీకి షాకిచ్చిన అప్పీల్ కోర్టు..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండించిన GCC, రష్యా..!!
- అరేబియా చిరుతపులి రక్షణకు మొబైల్ క్లినిక్..!!
- రీజినల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
- YSR వారసుడిగా నా కొడుకే ..వైఎస్ షర్మిల
- ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
- నవంబర్ 20 నుంచి తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్