BRS ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారు
- October 10, 2023
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నిలకు నగారా మోగిన సంగతి తెలిసిందే. నవంబర్ 30వ తేదీన ఒకే దశలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఈసీ. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఎన్నికల నగారా మోగడంతో అన్ని పార్టీలు ఎలక్షన్స్ కు సిద్ధమైపోయాయి. ముచ్చటగా మూడోసారి విజయం సాధించాలని అధికార బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 15 నుండి నవంబర్ 8 వరకు కేసీఆర్ టూర్ ఫిక్స్ అయ్యింది. తొలి రోజు హుస్నాబాద్ లో పబ్లిక్ మీటింగ్ లో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
నవంబర్ 9న మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల మధ్య గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం కామారెడ్డిలో బహిరంగ సభలో పాల్గొనున్నారు సీఎం కేసీఆర్.
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. 2024 జనవరి 16తో రాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్
నవంబర్ 3: ఎన్నికల నోటిఫిషన్ జారీ
నవంబర్ 10: నామినేషన్లకు తుది గడువు
నవంబర్ 13: నామినేషన్ల పరిశీలన
నవంబర్ 15: ఉపసంహరణకు తుది గడువు
నవంబర్ 30 : పోలింగ్
డిసెంబర్ 3 : ఓట్ల లెక్కింపు
తాజా వార్తలు
- ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
- సోనియా గాంధీకి కోర్టులో ఊరట
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!
- సివిల్ ఏవియేషన్ పై కువైట్, భారత్ చర్చలు..!!
- ఖరీఫ్ 2025.. సలామ్ ఎయిర్ రికార్డు వృద్ధి..!!
- సౌదీ అరేబియాలో 3.6 మిలియన్ల ప్రొడక్టులు సీజ్..!!
- టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను పరిశీలించిన టిటిడి ఈవో