Bathukamma 2023:9 రోజుల పాటు సాగే పూల ఉత్సవం ‘బతుకమ్మ’
- October 11, 2023
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ. ఈ సంవత్సరం బతుకమ్మ పండుగ అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 22 వరకు జరుపుకోనున్నారు. తొమ్మిది రోజుల పాటు ఆడి పాడి గౌరీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే ఈ బతుకమ్మ తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం.
ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలు తొమ్మిదిరోజులపాటు సాగి సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపడంతో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజుల పాటు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, నిత్యం గౌరీదేవిని తమ ఆటపాటలతో మహిళలు పూజిస్తారు. తొమ్మిదవ రోజు చివరగా అత్యంత ముఖ్యమైన సద్దుల బతుకమ్మ ను జరుపుకుంటారు. ఆశ్వయుజ అష్టమి నాడు,అంటే దుర్గాష్టమి నాడు ఐదు రకాల నైవేద్యాలతో సద్దుల బతుకమ్మ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు.
తొమ్మిదిరోజులపాటు 9 రకాల బతుకమ్మలు, ప్రసాదాలు :
1. ఎంగిలిపువ్వు బతుకమ్మ: నువ్వులు, బియ్యం పిండి, నూకలు
2. అటుకుల బతుకమ్మ: అటుకులు, పప్పు, బెల్లం
3. ముద్దపప్పు బతుకమ్మ: ముద్దపప్పు, పాలు, బెల్లం
4. నానేబియ్యం బతుకమ్మ: నానబెట్టిన బియ్యం, బెల్లం ,పాలు
5. అట్ల బతుకమ్మ: అట్లు, దోసెలు
6. అలిగిన బతుకమ్మ: (ఆరవ రోజు బతుకమ్మను జరుపుకోరు.సంబరాలకు దూరంగా ఉంటారు)
7. వేపకాయల బతుకమ్మ: బియ్యంపిండితో చేసిన ముద్దలు
8. వెన్నముద్దల బతుకమ్మ: వెన్న, నువ్వులు, బెల్లం
9. సద్దుల బతుకమ్మ: పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









