నయా అవతార్‌లో మాళవిక నాయర్.!

- October 16, 2023 , by Maagulf
నయా అవతార్‌లో మాళవిక నాయర్.!

మాళవికా నాయర్ అంటే క్యూట్ అండ్ బబ్లీ హీరోయినే గుర్తుకొస్తుంది. తనకిచ్చిన పాత్రలో నేచురాలిటీని చూపిస్తూ కాన్ఫిడెంట్‌గా కనిపించే ఈ మలయాళ కుట్టీ ఇప్పుడు సీరియస్ లుక్స్‌లోకి మారిపోయింది.

కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతోన్న ‘డెవిల్’ సినిమాలో మాళవికా నాయర్ ఓ సరికొత్త పాత్రలో దర్శనమివ్వబోతోంది. లేటెస్ట్‌గా ఈ సినిమా నుంచి మాళవిక నాయర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

‘మనిమేకల’ అనే పాత్రలో మాళవిక నాయర్ నటిస్తోంది. ఇదో సీరియస్ పొలిటీషియన్ పాత్రలా కనిపిస్తోంది. షార్ట్ హెయిర్‌తో శారీ కట్టుకుని చాలా డిగ్నిఫైడ్ లుక్స్‌లో కనిపిస్తోంది మాళవికా నాయర్.

ఈ పాత్ర నెగిటివ్ షేడ్స్‌తో కూడుకున్నదని కొందరంటున్నారు. కాదు కాదు. ఓ హుందా అయిన లేడీ పొలిటీషియన్ రోల్ అని ఇంకొందరంటున్నారు.

ఏది ఏమైతేనేం, మాళవికా నాయర్ సరికొత్త లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్నట్లు ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com