బహ్రెయిన్ లో మిడిల్ ఈస్ట్‌లో అతిపెద్ద స్కూల్ స్పోర్ట్ ఈవెంట్‌

- October 19, 2023 , by Maagulf
బహ్రెయిన్ లో మిడిల్ ఈస్ట్‌లో అతిపెద్ద స్కూల్ స్పోర్ట్ ఈవెంట్‌

బహ్రెయిన్: వచ్చే ఏడాది అక్టోబర్‌లో బహ్రెయిన్‌లో ఇంటర్నేషనల్ స్కూల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ISF) జిమ్నాసియాడ్ 2024 క్రీడా కార్యక్రమం జరగనున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువకుల మధ్య విద్య, సాంస్కృతిక మార్పిడికి కూడా ఇది అవకాశంగా ఉంటుంది. ISF ప్రెసిడెంట్ లారెంట్ పెట్రింకా మాట్లాడుతూ.. ఇది కేవలం క్రీడకు సంబంధించినది కాదని,ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ తరాల మధ్య విద్య,  సాంస్కృతిక మార్పిడికి సంబంధించినదని పేర్కొన్నారు. మిడిల్ ఈస్ట్‌లో ఈవెంట్‌ను నిర్వహించడంలో ముందున్నందుకు బహ్రెయిన్‌కు పెట్రింకా తన కృతజ్ఞతలు తెలిపారు. బహ్రెయిన్‌లోని అమెరికన్ యూనివర్సిటీ ఆడిటోరియంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పురోగతిని వెల్లడించారు. ISF జిమ్నాసియాడ్ 2024 కోసం ఎగ్జిక్యూటివ్ LOC చైర్మన్ ఇషాక్ అబ్దుల్లా ఇషాక్ ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను కార్యక్రమంలో అంతర్జాతీయ అధికారులకు అందించారు. ISF జిమ్నాసియాడ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పాఠశాల క్రీడల కార్యక్రమం. 80 కంటే ఎక్కువ దేశాల నుండి 5,000 మంది విద్యార్థులు 25 విభిన్న క్రీడలలో పాల్గొంటున్నారు. ఈ ఈవెంట్ 2024 అక్టోబర్ 23–31 మధ్య బహ్రెయిన్‌లో జరుగుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com