చర్మ సౌందర్యానికి డ్రాగన్ ఫ్రూట్.!
- October 21, 2023
చైనీస్ ఫ్రూట్‌గా చెప్పబడే డ్రాగన్ ఫ్రూట్‌కి ఇప్పుడు అన్ని చోట్లా విపరీతమైన డిమాండ్ వుంది. అన్ని రకాల సీజన్లలోనూ, అన్ని ప్రాంతాల్లోనూ విరివిగా ఈ పండు లభిస్తోంది ఈ రోజుల్లో.
అయితే, చూడ్దానికి ఎంతో అందంగా, ఆకర్ణణీయంగా కనిపించే ఈ డ్రాగన్ ఫ్రూట్‌ని ఎందుకు తినాలి.? డ్రాగన్ ఫ్రూట్ అందంగా కనిపించడమే కాదండోయ్.. బోలెడంత ఆరోగ్యాన్నీ ఇస్తుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లూ, మినరల్స్, విటమిన్లు పుష్కలంగా వుంటాయ్.
ముఖ్యంగా చర్మ సంరక్షణలో డ్రాగన్ ఫ్రూట్ అత్యంత శక్తివంతంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్లతో పాటూ, యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా డ్రాగన్ ఫ్రూట్‌లో చాలా ఎక్కువగా వున్నాయట. అందుకే చర్మ సంరక్షణకు ఈ పండను తరచూ తినాలని చెబుతున్నారు.
రెగ్యులర్‌గా డ్రాగన్ ఫ్రూట్ తినేవారిలో వయసుతో పాటూ వచ్చే చర్మంపై ముడతలు రాకుండా వుంటాయని సైంటిఫిక్‌గా కొన్ని అధ్యయనాలు ప్రూవ్ చేశాయట. అలాగే ముఖం కాంతివంతంగా మెరిసేందుకు డ్రాగన్ ఫ్రూట్‌తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే మంచి పలితం వుంటుందంటున్నారు.
ఫేస్ ప్యాక్ కోసం డ్రాగన్ ఫ్రూట్‌లోని గింజల్ని తీసి సెపరేట్ చేయాలి. గుజ్జును ముఖానికి పట్టించాలి. వేరు చేసిన గింజల్ని వేస్ట్ చేయకుండా తినేయొచ్చు. లేదంటే వాటర్‌లో మిక్స్ చేసుకుని తాగేయొచ్చు. కాస్త రేటు ఎక్కువే అయినా డ్రాగన్ ఫ్రూట్‌తో సౌందర్య పరంగానూ ఆరోగ్యా పరంగానూ ఇలాంటి ప్రయోజనాలు అనేకం. ఇంకెందుకాలస్యం.! ఇంతవరకూ డ్రాగన్ ఫ్రూట్ టేస్ట్ చేయని వారుంటే ఇక నుంచి టేస్ట్ చేయండి. డైలీ మెనూలో కానీ, వారానికి రెండు మూడు సార్లు కానీ తినడం పనిగా పెట్టుకోండి.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి