ఇరాన్‌ పర్యటనలో ఉన్న నరేంద్రమోదీ

- May 23, 2016 , by Maagulf
ఇరాన్‌ పర్యటనలో ఉన్న నరేంద్రమోదీ

ఇరాన్‌ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ దేశ అధ్యక్షుడు హసన్‌ రౌసనీతో సమావేశమయ్యారు. టెహ్రాన్‌ చేరుకున్న మోదీకి.. రౌసనీ అధికారికంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఛాబహార్‌ ఓడరేవు అభివృద్ధి ఒప్పందంపై ప్రధాని మోదీ సంతకం చేసే అవకాశం ఉంది.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం ఇరాన్‌ చేరుకున్నారు. మొదట గంగా సింగ్‌ సాభా గురుద్వారాను సందర్శించి.. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 15 ఏళ్లలో భారత ప్రధాని ఇరాన్‌ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com