అయ్యో పాపం అనసూయా.! ఇకపై అయినా జర జాగ్రత్తా.!

- October 27, 2023 , by Maagulf
అయ్యో పాపం అనసూయా.! ఇకపై అయినా జర జాగ్రత్తా.!

బుల్లితెర నుంచి పెద్ద తెరకు పరిచయమైన ముద్దుగుమ్మల్లో అనసూయ ఒకరు. ‘రంగస్థలం’ సినిమాతో అనసూయ కెరీర్ టర్న్ అయిపోయింది. కొన్ని క్రేజీయెస్ట్ రోల్స్‌లో అనసూయ తనదైన పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకుంటోంది. ‘రంగస్థలం’ తర్వాత ‘పుష్ప’ సినిమా అనసూయకు మరో కమ్ బ్యాక్ అని చెప్పొచ్చు.
అయితే, ఇటీవల అనసూయ చాలా సినిమాల్లో నటించేసింది. కానీ, ఏవీ పెద్దగా వర్కవుట్ కావడం లేదు. క్రేజ్ వుంది కదా.. అని ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ చేసేస్తోంది. మొన్నామధ్య ‘విమానం’ సినిమాలో వ్యాంప్ రోల్ పోషించింది. అలాగే ‘ప్రేమ విమానం’ అనే సినిమా కోసం హోమ్లీ లేడీ అవతారమెత్తింది కానీ, ఆ పాత్ర నుంచి ప్రేక్షకులు ఆశించిన పవర్ చూపించలేకపోయింది.
స్కోపున్నా ఆ పాత్రను డైరెక్టర్ సరిగ్గా వాడలేకపోయాడన్న అభిప్రాయాలొస్తున్నాయ్. సినిమాల్లో గుక్క తిప్పుకోకుండా బిజీ అయిపోవడం వల్ల బుల్లితెరని కూడా వదిలేసింది అనసూయ.
అయితే, సిల్వర్ స్ర్కీన్‌పై ఆమెకొచ్చిన అనూహ్యమైన రెస్పాన్స్‌కి కాస్త ఆచి తూచి క్యారెక్టర్లు ఎంచుకుంటే ఇంకా మంచి భవిష్యత్తు వుంటుందనేది ఆమె అభిమానుల అభిప్రాయం.
అన్నట్లు అనసూయ ‘పుష్ప 2’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘దాక్షాయణి’ పాత్రలో మొదటి పార్ట్‌లో కనిపించింది. ఆ పాత్రకు బోలెడన్ని విమర్శలొచ్చాయ్. కానీ, రెండో పార్ట్‌లో దాక్షాయణి పాత్రను మరింత పవర్ ఫుల్‌గా స్టన్నింగ్‌గా తీర్చిదిద్దారని తెలుస్తోంది. చూడాలి మరి.  ‘పుష్ప 2’నే అనసూయకి బౌన్స్ బ్యాక్ అవుతుందేమో.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com