‘నా సామిరంగ’.! నాగార్జున కూడా సంక్రాంతిని టార్గెట్ చేశాడా.?
- November 02, 2023
అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామిరంగ’. విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
బిగ్‌బాస్ టైమ్‌లో నాగార్జున నుంచి ఖచ్చితంగా ఓ సినిమా వస్తుంటుంది. అలా ఈ సీజన్ బిగ్‌బాస్ షో రన్ అవుతుండగా ‘నా సామిరంగ’ షూటింగ్ కూడా జరుగుతోంది.
పక్కా మాస్ గెటప్‌లో నాగార్జున ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం మైసూర్లో షూటింగ్ జరిపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది.
ఇంకా వేగంగా మిగిలిన పార్ట్ కంప్లీట్ చేసి, సంక్రాంతి బరిలో ఈ సినిమాని దించాలని అనుకుంటున్నాడట నాగార్జున. అన్నట్లు ఈ సినిమాలో ఇద్దరు యంగ్ హీరోలు ప్రత్యేకమైన పాత్రల్లో నటిస్తున్నారు.
వారు మరెవరో కాదు, ఒకరు అల్లరి నరేష్ కాగా, ఇంకొకరు రాజ్ తరుణ్. అక్టోబర్‌లో జరిగిన షూటింగ్లో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ మధ్య సన్నివేశాల్ని చిత్రీకరించారట.
ఈ ఇద్దరూ హైపర్ యాక్టివ్ హీరోలే. సినిమాకి ఖచ్చితంగా ప్లస్ అవుతారని అంటున్నారు. చూడాలి మరి, ‘నా సామిరంగ’ ఏ తరహా కాన్సెప్ట్ మూవీనో.. అటు ఆ యంగ్ హీరోలకీ, ఇటు నాగార్జునకీ ఎలాంటి రిజల్ట్ తెచ్చిపెడుతుందో.!
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







