రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ గర్భిణి
- May 24, 2016
ఘోర రోడ్డు ప్రమాదం నుంచి ఓ గృహిణి ప్రాణాలతో బయటపడింది. ఐదు నెలల గర్భంతో ఉన్న ఆ మహిళ ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. స్పృహలో లేని పరిస్థితుల్లో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఫుజారియాలోని ఆసుపత్రికి తొలుత ఆమెను తరలించి, అనంతరం వైద్యుల సూచన మేరకు సక్ర్ హాస్పిటల్‌కి తరలించగా, అక్కడామెకు అత్యవసర శస్త్ర చికిత్స చేశారు. డాక్టర్ ఇబ్రహీం మొహమ్మద్ ఖైర్ అల్ యూసుఫ్ నేతృత్వంలోని న్యూరో సర్జన్స్ టీమ్ ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించింది. ఆ మహిళ కపాలానికి రంధ్రం చేసి, అక్కడ క్లాట్ అయిన రక్తాన్ని తొలగించామని డాక్టర్ యూసుఫ్ చెప్పారు. అనంతరం ఆమె గర్భానికి పరీక్షలు నిర్వహించామనీ, అదృష్టవశాత్తూ ఆమె గర్భానికి ఎలాంటి సమస్యా లేదని ఆయన వివరించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, తదుపరి పరీక్షలు నిర్వహించి తగిన చికిత్సను అందిస్తామని చెప్పారాయన.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









