‘ధృవ నక్షత్రం’.! రీతూవర్మ బౌన్స్ బ్యాక్ అవుతుందా.?
- November 06, 2023
‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోయిన్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ రీతూ వర్మ.. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాలతో ఆకట్టుకుంది. తొలి సినిమా క్రేజ్‌తోనే ఏకంగా తమిళంలో సీనియర్ హీరో విక్రమ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.
విక్రమ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో రీతూ వర్మ హీరోయిన్‌గా ఎంపికైంది. ఆ ప్రాజెక్ట్ పేరే ‘ధృవ నక్షత్రం’. అప్పుడెప్పుడో పట్టాలెక్కిన ఈ సినిమా ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు రిలీజ్‌కి నోచుకుంటోంది.
ఈ నెల 24న ‘ధృవ నక్షత్రం’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తున్నారట. రెండో పార్ట్ మార్చిలో రిలీజ్ కానుందట. ఇదిలా వుంటే, రీతూ వర్మ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫేడవుట్ హీరోయిన్ లిస్టులోకి వెళ్లిపోయింది.
ఇతర భాషల్లోనూ ఏమంత పెద్దగా సీను లేదు. కానీ, ఈ టైమ్‌లో ఆమె నుంచి వస్తోన్న భారీ చిత్రం ‘ధృవ నక్షత్రం’తో రీతూ వర్మ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుందేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..