గ్లామరే కాదు.. ఛాలెంజింగ్ రోల్స్‌కీ సై అంటోన్న ‘మాస్టర్’ బ్యూటీ.!

- November 06, 2023 , by Maagulf
గ్లామరే కాదు.. ఛాలెంజింగ్ రోల్స్‌కీ సై అంటోన్న ‘మాస్టర్’ బ్యూటీ.!

మాళవిక మోహనన్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. పాప సోషల్ మీడియాలో యమా యాక్టివ్. తెలుగులో చేసినవి చాలా తక్కువ సినిమాలే. అయినా కానీ, అమ్మడికి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
ప్రస్తుతం తెలుగులో ప్రబాస్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోంది. మారుతి ఈ సినిమాకి దర్శకుడు. కాగా, తమిళ డబ్బింగ్ సినిమాలతోనే అక్కడా ఇక్కడా క‌ూడా బోలెడంత క్రేజ్ దక్కించుకుందీ మలయాళ ముద్దుగుమ్మ.
గ్లామర్ డాళ్‌గా మాళవిక మోహనన్‌కి సోషల్ మీడియాలో పిచ్చ పిచ్చగా ఫాలోయింగ్ వుంది. ఎప్పటికప్పుడే గ్లామర్ ఫోటోస్ పోస్ట్ చేస్తూ నెటిజన్లకు కిర్రాకెత్తిస్తుంటుంది. అలాంటి మాళవిక మోహనన్ ఇప్పుడు గుర్తు పట్టలేని డీ గ్లామర్ రోల్‌‌లోకి మారిపోయింది.
అదంతా ‘తంగలాన్’ సినిమా కోసం. విక్రమ్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ ట్రైబల్ గాళ్‌గా కనిపించబోతోంది. అందుకోసం కంప్లీట్ ఛేంజోవర్ అయిపోయింది మాళవిక మోహనన్.
డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌, మేకప్‌తో గుర్తు పట్టలేనంతగా తయారైంది. ఈ పాత్ర తనకు దక్కడం చాలా అదృష్టంగా భావిస్తున్నాననీ, కేవలం గ్లామర్ రోల్సే కాదు, ఈ తరహా ఛాలెంజింగ్ రోల్స్‌కీ తాను సిద్దంగా వున్నానని చెప్పేందుకు ఈ సినిమా ఓ శాంపిల్ అవుతుందనీ అంటోంది మాళవిక మోహనన్.
అలాగే, ఈ పాత్ర కోసం తాను చాలా కష్టపడ్డానని కూడా చెబుతోంది. ‘తంగళాన్’ నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com