చైతూకి ప్రెస్టీజియస్‌గా మారిన కొత్త ప్రాజెక్ట్.!

- November 06, 2023 , by Maagulf
చైతూకి ప్రెస్టీజియస్‌గా మారిన కొత్త ప్రాజెక్ట్.!

#NC23 కోసం నాగ చైతన్య పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు.! అవునండీ.! సిక్స్ ప్యాక్ బాడీ ట్రై చేస్తున్నాడు. అందుకోసం చాలా కష్టపడి వర్కవుట్లు చేస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న సినిమా కోసమే ఈ కష్టమంతా.!
ఈ సినిమాని యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. మత్య్సకారుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందబోతోంది. ఇప్పటికే డైరెక్టర్‌తో కలిసి నాగ చైతన్య.. పలువురు మత్స్యకారులను కలిసి వారి హావభావాలను తెలుసుకోవడంతో పాటూ, తన పాత్రకు నేచురాలిటీ తీసుకొచ్చే విధంగా మత్స్యకారులతో మమేకమై మెలుగుతున్నారట.
ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడట చైతూ. సాయి పల్లవిని ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంచుకోవడంతో సినిమాపై హైప్ పెరిగింది.
సాయి పల్లవి వుందంటే, కథలో పట్టు.. ఆమె పాత్రలోని బిగువు.. ప్రేక్షకులు ఓ అంచనాకి వచ్చేశారు. సో, అలా ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు బాగా పెరిగిపోయాయ్. అలాగే, ఈ సినిమాలో చైతూ గెటప్ ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది. లాంగ్ హెయిర్, అండ్ బియర్డ్‌తో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సరికొత్త లుక్స్‌లో కనిపిస్తున్నాడు.
తాజాగా చైతూ లుక్స్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. ‘బీస్ట్’లా మారిపోయిన నాగ చైతన్య.. అంటూ ఆ ఫోటోలకి అక్కినేని ఫ్యాన్స్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com