'నాకు నా కాళ్లు వెనక్కి కావాలి': గాజా యుద్ధంలో అంగవైకల్యం పొందిన చిన్నారులు

- November 08, 2023 , by Maagulf
\'నాకు నా కాళ్లు వెనక్కి కావాలి\': గాజా యుద్ధంలో అంగవైకల్యం పొందిన చిన్నారులు

యూఏఈ: ఇజ్రాయెల్ -హమాస్‌ యుద్ధంలో భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరుగుతుంది. అనేక మంది అవయవాలను కోల్పోయి వికలాంగులుగా మిగులుతున్నారు. గాజకు చెందిన లాయన్ అల్-బాజ్ తన కాళ్లు తీసివేసిన తర్వాత బాధతో ఏడుస్తుంది. 'నాకు నా కాళ్లు వెనక్కి కావాలి' అని 13 ఏళ్ల పాలస్తీనియన్ దక్షిణ గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యునిస్ నాజర్ ఆసుపత్రిలో మీడియా ముందు విలపించడం అందరిని కలిచి వేసింది. పేదరికంలో ఉన్న పాలస్తీనా భూభాగం, సంవత్సరాల తరబడి ఇజ్రాయెల్ నేతృత్వంలోని దిగ్బంధనంలో ఉంది. అక్టోబర్ 7 న యుద్ధం చెలరేగినప్పటి నుండి ఇజ్రాయెల్ సైన్యం ముట్టడి కారణంగా ఆహారం, నీరు మరియు ఇంధనం కొరతను ఎదుర్కొంటుంది. అదే సమయంలో వైద్య సదుపాయాలు నాశనం అయ్యాయి. అందుబాటులో ఉన్న వైద్య సామాగ్రి చాలా తక్కువగా ఉంది.హమాస్ ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. యుద్ధం చెలరేగినప్పటి నుండి గాజాలో 10,328 మంది మరణించారు. వీరిలో 4,000 మందికి పైగా పిల్లలు ఉన్నారు. బాలుడి ఇంటిపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో తన ఇద్దరు అక్కలను, ఒక తమ్ముడిని కోల్పోయింది. తాను కృత్రిమ కాలును పొందిన తర్వాత చదువును కొనసాగిస్తానని, తద్వారా డాక్టర్ కావాలనే తన కలను సాధించగలనని, తన కుటుంబానికి అండగా ఉంటానని అశాభావం వ్యక్టం చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com