మెగాస్టార్ చిరంజీవి ఏం నేరం చేశాడని.?
- November 15, 2023
ఓ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఇటీవల దీపావళి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, తనకు అత్యంత సన్నిహితులైన పలువురు సినీ ప్రముఖులకు ఇచ్చిన పార్టీకి సంబంధించిన ఓ చిన్న వీడియో అది.
అందులో చిరంజీవి, అత్యద్భుతంగా డాన్స్ చేశారు. ఒకామె పాట పాడుతోంటే, ఆమె పాటకు అనుగుణంగా చిరంజీవి స్టెప్పులేశారు. ఏడు పదుల వయసుకు చేరవవుతున్నా మెగాస్టార్ చిరంజీవి డాన్సుల్లో గ్రేస్ తగ్గలేదని ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది.
అయితే, ఈ వీడియోలో పాట పాడిన అమ్మాయిని చిరంజీవి అసభ్యకరంగా తాకారంటూ కొందరు నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఈ ట్రోలింగ్‌కి మెగాభిమానుల నుంచి కౌంటర్ ఎటాక్ కూడా గట్టిగా పడుతోంది.
‘భగవంత్ కేసరి’ సినిమాలో గుడ్ టచ్ - బ్యాడ్ టచ్ గురించి నందమూరి బాలకృష్ణ చాలా బాగా చెప్పారనీ, చిరంజీవి తన స్థాయిని మరచి ‘బ్యాడ్ టచ్’ చేశారనీ, బాధిత మహిళ ఎంతో ఆవేదన చెంది వుంటుందనేది ఆ ట్రోలింగ్ సారాంశం.
పాట బాగా పాడి అలరించినందుకుగాను చిరంజీవి ఆమెను అభినందించారు. దాన్ని అత్యంత అసభ్యకరంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం సబబు కాదన్నది మెగాభిమానుల వాదన. సోషల్ మీడియాలో చిరంజీవిని టార్గెట్ చేయడం ఇదే కొత్త కాదు.! పనిగట్టుకుని కొందరు ఈ తరహా దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







