నాగచైతన్య ‘దూత’గా వచ్చేస్తున్నాడహో.!
- November 15, 2023
అక్కినేని నాగచైతన్య తొలిసారిగా ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఓ వెబ్ సిరీస్‌లో ఇప్పటికే నటించాడు. త్వరలో ఆ వెబ్ సిరీస్ విడుదల కాబోతోంది. వెబ్ సిరీస్ పేరు ‘దూత’ కాగా, విక్రమ్ కె కుమార్ ఈ వెబ్ సిరీస్‌కి దర్శకత్వం వహించాడు.
సినీ ప్రముఖులు ఓటీటీ వైపు చూస్తున్న సంగతి తెలిసిందే. ‘రానా నాయుడు’ పేరుతో విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి ఓ వెబ్ సిరీస్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వెబ్ సిరీస్ అప్పట్లో వివాదాస్పదమయ్యింది. అయితేనేం, ఎన్ని విమర్శలొచ్చినా.. కంటెంట్ జనాల్లోకి బలంగా వెళ్ళిపోయింది.
ఇక, ఇప్పుడు నాగచైతన్య ‘దూత’గా ఏం చేయబోతున్నాడు.? ఏమోగానీ, డిసెంబర్ 1న విడుదల కానున్న ఈ వెబ్ సిరీస్ గురించి, తెలుగుతోపాటు తమిళ సినీ అభిమానులూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పలు ఇతర భాషల్లోనూ దీన్ని స్ట్రీమింగ్ చేస్తారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా డిసెంబర్ 1 నుంచి ‘దూత’ స్ట్రీమింగ్ కాబోతోంది. హై క్వాలిటీతో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ‘దూత’ని తెరకెక్కించామని మేకర్స్ చెబుతున్నారు. పార్వతి తిరువొత్తు, ప్రియా భవానీ శంకర్ తదితరులు ఈ వెబ్ సిరీస్‌లో ఇతర ప్రధాన తారాగణం.
సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా వెబ్ సిరీస్‌లకూ ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ‘దూత’కి అంతకు మించి పబ్లిసిటీ చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







