‘సలార్’కి గ్లోబల్ రేంజ్ అద్దబోతున్న ప్రశాంత్ నీల్.!

- November 15, 2023 , by Maagulf
‘సలార్’కి గ్లోబల్ రేంజ్ అద్దబోతున్న ప్రశాంత్ నీల్.!

ప్రబాస్ హీరోగా వస్తున్న సినిమా అంటే అది ఖచ్చితంగా యూనివర్సల్ మూవీ అవుతుంది. ‘బాహుబలి’ సినిమాతో ప్రబాస్ రేంజ్ యూనివర్సల్ స్థాయికి ఎదిగిన సంగతి తెలిసిందే.

తాజాగా ఎన్టీయార్ స్థాయి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ రేంజ్‌కి అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘సలార్’ కోసం ఎన్టీయార్ కూడా తన వంతు పార్టిసిపేట్ చేయబోతున్నాడట.

ఈ సినిమాకి ఎన్టీయార్ వాయిస్ ఓవర్ అవ్వబోతున్నాడనీ సమాచారం. ప్రశాంత్ నీల్‌తో ఎన్టీయార్ ఓ సినిమా చేయాల్సి వున్న సంగతి తెలిసిందే. సో, ఆ చొరవతోనే ఎన్టీయార్‌ని ‘సలార్’కి వాయిస్ ఓవర్ ఇవ్వాలని కోరాడట.

వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ‘దేవర’ షూటింగ్‌లో ప్రస్తుతం ఎన్టీయార్ బిజీగా వున్నప్పటికీ, ‘సలార్’ కోసం వాయిస్ ఇచ్చేందుకు ముందుకొచ్చాడట. దాంతో, ‘సలార్’ రేంజ్ నెక్స్‌ట్ లెవల్‌కి చేరింది.

అలాగే, ఈ సినిమాలో ‘కేజీఎఫ్’ హీరో యష్ ఓ సర్‌ప్రైజింగ్ గెస్ట్ రోల్ పోషించబోతున్నాడనీ ప్రచారం జరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com