నిరుద్యోగ బీమా పొందనందుకు జీతాల నుండి Dh400 కట్

- November 16, 2023 , by Maagulf
నిరుద్యోగ బీమా పొందనందుకు జీతాల నుండి Dh400 కట్

యూఏఈ: అక్టోబర్ 1 గడువులోపు నిరుద్యోగ బీమా పథకానికి సబ్‌స్క్రయిబ్ చేయడంలో విఫలమైన ఉద్యోగులు 400 దిర్హామ్‌లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. స్కీమ్‌కు సబ్‌స్క్రయిబ్ చేసి, మూడు నెలలకు పైగా ప్రీమియంలు చెల్లించడంలో విఫలమైన వారు 200 దిర్హామ్‌ల జరిమానాను ఎదుర్కొంటారు. జరిమానాలు చెల్లించకపోతే, ఉద్యోగులకు కొత్త వర్క్ పర్మిట్‌లు మంజూరు చేయబడవు. ఈమేరకు మానవ వనరులు మరియు ఎమిరటైజేషన్ (మోహ్రే) మంత్రిత్వ శాఖ బుధవారం హెచ్చరించింది. జరిమానాలు వారి జీతాలు లేదా ఎండ్-ఆఫ్-సర్వీస్ గ్రాట్యుటీ నుండి కూడా తీసివేయబడతాయని పేర్కొంది. నవంబర్ 15 నాటికి 6.6 మిలియన్లకు పైగా ప్రజలు తప్పనిసరి పథకానికి సభ్యత్వం పొందారని మోహ్రే తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com