ఇజ్రాయెల్-హమాస్ ఒప్పందం: 4 రోజుల్లో 50 మంది ఖైదీలు విడుదల

- November 23, 2023 , by Maagulf
ఇజ్రాయెల్-హమాస్ ఒప్పందం: 4 రోజుల్లో 50 మంది ఖైదీలు విడుదల

యూఏఈ: ఇజ్రాయెల్‌లో ఖైదు చేయబడిన 150 మంది పాలస్తీనియన్లకు బదులుగా గాజాలో బందీలుగా ఉన్న 50 మందిని విడుదల చేయడానికి ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందం జరిగింది. అలాగే గాజా ఎన్‌క్లేవ్‌లోకి మానవతా సహాయాన్ని అనుమతించడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం, హమాస్ నాలుగు రోజుల విరామానికి బుధవారం అంగీకరించాయి. ఇందుకు సంబంధించి ఇజ్రాయెల్ - హమాస్ అధికారులు ఒప్పందం కుదుర్చుకోవచ్చని చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన ఖతార్, యుఎస్ తెలిపాయి. ఇజ్రాయెల్ లెక్కల ప్రకారం.. 200 మందికి పైగా హమాస్ చెరలో ఉన్నారు. 50 మంది మహిళలు,  పిల్లలను నాలుగు రోజులలో విడుదల చేయనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 150 మంది పాలస్తీనా మహిళలు,  పిల్లలకు బదులుగా 50 మంది బందీలను విడుదల చేయనున్నట్లు హమాస్ తెలిపింది. యుద్ధ విరమణ ఒప్పందం వందలాది మానవతా, వైద్య మరియు ఇంధన సహాయంతో కూడిన ట్రక్కులను గాజాలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది అని హమాస్ వెల్లడించింది. సంధి కాలంలో గాజాలోని అన్ని ప్రాంతాల్లో ఎవరిపైనా దాడి చేయకూడదని లేదా అరెస్టు చేయకూడదని ఇజ్రాయెల్ కట్టుబడి ఉందని పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com