కొచ్చిన్ యూనివర్సిటీ ఫెస్టివల్ లో తొక్కిసలాట..
- November 26, 2023
కొచ్చి: కేరళలోని కొచ్చిలో యూనివర్సిటీ ఫెస్టివల్ లో జరిగిన తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. కొచ్చిలోని కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కుశాట్)లో శనివారం ఓపెన్ ఎయిర్ టెక్ ఫెస్టివల్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు మృతి చెందగా, 64 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
మృతులు అతుల్ తంబి, ఆన్ రుఫ్తా, సారా థామస్, ఆల్విన్ జోసెఫ్‌లుగా గుర్తించారు. ఆల్విన్ మినహా మిగిలిన ముగ్గురు విద్యార్థులు కొచ్చిన్ యూనివర్శిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ నిర్వహిస్తున్న వార్షిక టెక్ ఫెస్టివల్ రెండవ రోజు కోసం 2,000 మందికి పైగా ప్రజలు, వివిధ కళాశాలల విద్యార్థులు, స్థానికులు వేదిక వద్ద ఉన్నట్లు అంచనా వేశారు.
సంఘటనా స్థలంలోని ప్రత్యక్ష సాక్షులు, పోలీసు సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం ఈ సంఘటన రాత్రి 7 గంటలకు జరిగిందని అండ్ ఆర్డర్ ఏడీజీపీ ఎంఆర్ అజిత్ కుమార్ తెలిపారు. 1,500 మంది వరకు కూర్చునే సామర్థ్యం ఉన్న యాంఫిథియేటర్ ఆ సమయంలో పాక్షికంగా నిండిపోయిందని ఏడీజీపీ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులే స్వయంగా నిర్వహిస్తూ నియంత్రించారని, యూనివర్సిటీలో ఆరుగురు పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..