COP28 సమావేశాలకు యూఏఈ సిద్ధం

- November 26, 2023 , by Maagulf
COP28 సమావేశాలకు యూఏఈ సిద్ధం

దుబాయ్: ఐక్యరాజ్య సమితి సారథ్యంలో జరిగే కాప్‌ 28వ సదస్సుకు యూఏఈ అతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం వాతావరణ సమస్యలపై దృష్టి పెట్టింది. ఈనెల 30 నుంచి డిసెంబరు 12 వరకు దుబాయ్‌లో కాప్‌-28 సదస్సు జరగనుంది. 2050 నాటికి కార్బన్‌ ఉద్గారాలను సున్నాకు తగ్గించాలని లక్ష్యం పెట్టుకున్న యూఏఈ అందుకోసం బిలియన్ల డాలర్లను ఖర్చు చేస్తోంది. అందులో భాగంగా దుబాయ్ పాలకుడు మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పేరుతో ఏర్పాటు చేసిన సోలార్ పార్క్‌లో ఇప్పటికే దాదాపు 122 చదరపు కిలోమీటర్ల మేర సోలార్‌ విద్యుత్ ప్లాంట్‌ను.... ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్‌ హమాస్‌ యుద్ధం వల్ల కర్బన ఉద్గారాలను తగ్గించాలనే విషయంలో చర్చలు పూర్తిగా పక్కదారి పట్టాయి. ఈ నేపథ్యంలో కాప్‌ 28 సదస్సు ద్వారా.. పర్యావరణ పరిరక్షణ కోసం చర్చలు మెుదలుపెట్టేందుకు మరో అవకాశం లభించిందని అరబ్ దేశం భావిస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com