ప్రీ పోల్ సర్వే ప్రకారం ఈసారి హస్తం పార్టీదే హవా..
- November 26, 2023
హైదరాబాద్: 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో ప్రీ పోల్ సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. గత రెండు సార్లు తిరుగులేని మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఓటర్లు ఈసారి ఓటర్లు హ్యాండ్ ఇచ్చి హస్తం గుర్తు పార్టీతో షేక్ హ్యాండ్ ఇస్తారని సౌత్ ఫస్ట్ సర్వే చెబుతోంది.ఈ సర్వే ప్రకటించిన ఫలితాల ఆధారంగా చూసుకుంటే మొదటి స్థానంలో కాంగ్రెస్ ఉంది.ప్రీ పోల్ సర్వే ప్రకారం 57-నుంచి 62 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు గెలుస్తారని ప్రకటించింది.
ఇక అధికార బీఆర్ఎస్ 41-46 సీట్లు గెలిచే ఛాన్సు ఉందని సర్వే తేల్చింది.అధికారం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్న బీజేపీ మూడో స్థానం కూడా దక్కించుకోదని సర్వే ద్వారా తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ సవాల్ గా తీసుకున్నాయి.ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఈసారి గెలిచే అవకాశం తక్కువగానే ఉందని ప్రీ పోల్ సర్వే ద్వారా వెల్లడైంది. సౌత్ ఫస్ట్ నిర్వహించిన ఈ ప్రీ పోల్ సర్వే ప్రకారం ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ కు ఈసారి 57-నుంచి 62 అసెంబ్లీ స్థానాలు గెలుస్తుందని పేర్కొంది.ఇక అధికార బీఆర్ఎస్ 41-46 సీట్లు గెలిచే ఛాన్సు ఉందని సర్వే తేల్చింది.
తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పుకుంటున్న బీజేపీకి సింగిల్ డిజిట్ సీట్లు మాత్రమే గెలిచే ఛాన్సు ఉన్నట్లుగా సర్వేలో తేలింది. సౌత్ ఫస్ట్ నిర్వహించిన ఈ ప్రీ పోల్ సర్వే ఆదారంగా బీజేపీ 3-6సీట్లు మాత్రమే గెలుస్తుందని తెలిపింది. ముూడో స్థానంలో మజ్లీస్ పార్టీ ఏఐఎంఐఎం(AIMIM) యధావిధిగా తమ సిట్టింగ్ స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించింది.మజ్లీస్ పార్టీ 6-7 సీట్లు ఇతరులు ఒకటి రెండు స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తోందని సౌత్ ఫస్ట్ తమ ప్రీ పోల్ సర్వే ద్వారా తెలిపింది.
ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ప్రతీ పార్టీ తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తున్నప్పటికి..కాంగ్రెస్ మాత్రం ఢంకాభజాయించి మరీ డిసెంబర్ 9న ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని తేదిని కూడా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ధీమాతో పాటు ప్రకటించిన గ్యారెంటీ పథకాలు, సర్వేలు చూస్తుంటే ఓటర్ల నాడిని పట్టుకోవడం కష్టంగానే మారింది. ఈసారి తెలంగాణ ఓటర్లు ఏ పార్టీ చేతుల్లో రాష్ట్రాన్ని అప్పగిస్తారో తెలియాలంటే డిసెంబర్ 3వ తేది వరకు వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







