సత్యభామగా కాజల్ వేరే లెవల్.!

- December 02, 2023 , by Maagulf
సత్యభామగా కాజల్ వేరే లెవల్.!

‘భగవంత్ కేసరి’ సినిమాతో కాజల్ అగర్వాల్ మంచి పేరు తెచ్చుకుంది. సహజంగా హీరోయిన్లకుండే స్ర్కీన్ స్పేస్ కన్నా ఈ సినిమాలో కాజల్‌కి హీరోయిన్‌గా మంచి స్పేసే దక్కింది.
ఇక తదుపరి కాజల్ అగర్వాల్ ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.
ఆ సినిమానే ‘సత్యభామ’. ‘మేజర్’ ఫేమ్ శశికిరణ్ తిక్కా ఈ సినిమాకి స్ర్కీన్‌ప్లే ఇస్తున్నారు. ఈ సినిమాలో పోలీసాఫీసర్ సత్యభామగా కాజల్ కనిపిస్తోంది. లేడీ పోలీస్ ఆఫీసర్‌గా సత్యభామ పాత్రలోని పవర్‌ని ఆ ఫస్ట్ గ్లింప్స్‌లో చూపించాడు డైరెక్టర్.
ఇక, ‘భగవంత్ కేసరి’ తర్వాత కాజల్‌ని ‘సత్యభామ’గా ఇంకాస్త ఎక్కువే అంచనా వేస్తున్నారు. నిజంగానే ఈ సినిమా ఆ అంచనాల్ని అందుకుంటుందని కాజల్ చెబుతోంది.
చాలా ఇష్టపడి ఈ కథని ఓకే చేసిందట కాజల్. అంతేకాదు, మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుందట ఈ సినిమా కోసం. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం లేడీ సూపర్ స్టార్ విజయ శాంతిని ఇన్సిప్రేషన్‌గా తీసుకున్నానని కాజల్ చెబుతోంది.
ఈ సినిమా తన కెరీర్‌లో ఓ మైలు రాయి అవుతుందనీ, ఇంతవరకూ మీకు తెలిసిన కాజల్ వేరు.. ‘సత్యభామ’ తర్వాత మీరు చూడబోయే కాజల్ వేరు.. అని నమ్మకంగా చెబుతోంది. చూడాలి మరి, ‘సత్యభామ’గా కాజల్ ఏం చేసిందో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com