అమరావతే ఏపీ రాజధాని స్పష్టత ఇచ్చిన కేంద్రం
- December 04, 2023
అమరావతి: ఏపీ రాజధానిపై కీలక ప్రకటన చేసింది కేంద్రం. అమరావతే ఏపీ రాజధాని అని మరోసారి క్లారిటీ ఇచ్చింది. అమరావతి మాస్టర్ ప్లాన్ ను కేంద్రం ఆమోదించినట్లు పార్లమెంటు సాక్షిగా వెల్లడించింది. 28 రాష్ట్రాల రాజధానుల జాబితాను కేంద్రం విడుదల చేసింది. ఆ జాబితాలో ఏపీ రాజధానిగా అమరావతి పేరును ప్రస్తావించింది.
రాజ్యసభలో ఎంపీ జావెద్ అలీ ఖాన్ అడిగిన ప్రశ్నలకు కేంద్రం స్పష్టత ఇచ్చింది. దేశంలోని చాలా (39శాతం) రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదనేది నిజమా? కాదా? అని ఎంపీ జావెద్ ప్రశ్నించారు. ఎంపీ ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి కౌశల్ కిశోర్ వివరణ ఇచ్చారు. రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్న మాట అవాస్తవం అన్నారు.
ఏపీ రాజధాని అమరావతితో సహా 26 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ ఉందని వెల్లడించారు. త్రిపుర రాజధాని అగర్తల, నాగాలాండ్ రాజధాని కోహిమాల మాస్టర్ ప్లాన్లు మినహా అన్ని రాష్ట్రాల రాజధానుల మాస్టర్ ప్లాన్లను కేంద్రం ఆమోదించినట్లు వివరించారాయన.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా నిర్ణయించారు. ల్యాండ్ పూలింగ్ (రైతుల దగ్గరి నుంచి భూములు సేకరించి) చేసి రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడం జరిగింది. ప్రధాని మోదీ శంకుస్థాపన కూడా చేశారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాజధాని మారుస్తున్నాం అంటూ బిల్లులు కూడా తీసుకొచ్చింది. ఒకటి కాదు మూడు రాజధానులు అని ప్రకటన చేసింది. రాజధాని మారుస్తూ బిల్లు తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం ఆ తర్వాత ఉపసంహరించుకుంది.
ఏపీ రాజధాని ఏది? అనే అంశంపై గతంలో అనేకసార్లు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇవాళ పార్లమెంటు వేదికగా మరోసారి ఏపీ రాజధాని అమరావతే అన్న విషయాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ స్పష్టం చేశారు. దేశంలో చాలా రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్నది అవాస్తవం అని, మాస్టర్ ప్లాన్లతోనే రాజధానులు ఏర్పడుతున్నాయి, ఒక ప్రణాళిక బద్దంగానే రాష్ట్రాల రాజధానులు ఏర్పాటవుతున్నాయని, వాటికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపిందన్నారు. ఏపీ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ కు సైతం కేంద్రం ఆమోదం తెలిపినట్లు కేంద్ర పట్టణాభివృద్ది శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!