‘గుడ్లవల్లేరు’లో వైభవంగా త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలు
- December 04, 2023
అమరావతి: డిసెంబర్ 30న గుడ్లవల్లేరు గ్రామంలో సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధన, స్వర్గీయ డాక్టర్ గుడ్లవల్లేటి లక్ష్మణరావు జయంతి ఉత్సవాలను నిర్వహించారు. శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణములోని త్యాగరాజస్వామి వారి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడ్లవల్లేటి కామేశ్వరరావు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ముఖ్యవక్తలుగా డాక్టర్ ఉప్పలపాటి వేణుగోపాలరావు (స్థానిక వైద్యులు), బిహెచ్విఎల్ రాధాకృష్ణ మూర్తి (రిటైర్డ్ ఎల్ఐసి ఉద్యోగి, అధ్యక్షులు త్యాగరాజ సంగీత విద్యా పీఠం, మచిలీపట్నం), గుడ్లవల్లేటి మృత్యంజయరావు (రిటైర్డ్ ప్రిన్సిపాల్, మచిలీపట్నం హిందూ కాలేజీ), వల్లభనేని వెంకటేశ్వర రావు (కమిటీ సభ్యులు శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం, గుడ్లవల్లేరు) హాజరై ప్రసంగించారు. అనంతరం నిర్వహించిన సంగీత కార్యక్రమంలో సింగరాజు కళ్యాణి (AIR ఆర్టిస్ట్, కార్యదర్శి త్యాగరాజ సంగీత విద్యా పీఠం, మచిలీపట్నం) గారికి, పాలపర్తి ఆంజనేయ శాస్త్రి, (వయోలిన్, AIR & TV ఆర్టిస్ట్, అవనిగడ్డ), కాపవరపు సుబ్బారావు (మృదంగం, AIR & TV ఆర్టిస్ట్, భీమవరం) సహకరించి శ్రోతలను అలరించారు. చివరగా గుడ్లవల్లేటి వెంకట సుబ్బరామన్ వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని గుడ్లవల్లేటి లక్ష్మణ రావు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!