భారీ వర్షాలు.. చెన్నైకి విమానాలు రద్దు

- December 05, 2023 , by Maagulf
భారీ వర్షాలు.. చెన్నైకి విమానాలు రద్దు

యూఏఈ: భారీ వర్షాల కారణంగా సోమవారం యూఏఈ నుండి చెన్నైకి పలు విమానాలు రద్దు అయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. చెన్పైలోని రోడ్లు, విమానాశ్రయాలు మరియు ప్రజా సౌకర్యాలు వరదలతో నిండిపోయాయి.  వరదలలో కొట్టుకుపోతున్న కార్ల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా" ఎయిర్‌ఫీల్డ్ కనీసం సోమవారం రాత్రి 11 గంటల వరకు మూసివేయబడిందని చెన్నై విమానాశ్రయ ఆపరేటర్ తెలిపారు.  డిసెంబరు 4న అబుదాబి - చెన్నై మధ్య రెండు విమానాలను (EY246/247 మరియు EY270/271) రద్దు చేసినట్లు ఎతిహాద్ ఎయిర్‌వేస్ తెలిపింది. ప్రభావిత ప్రయాణికులకు వసతి కల్పించేందుకు ఎయిర్‌లైన్ డిసెంబర్ 5న పెద్ద విమానాన్ని నడపాలని యోచిస్తోంది. రద్దు చేసిన విమానాల్లో బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్ సిబ్బంది సహాయం చేస్తారని ఎయిర్‌లైన్ ప్రతినిధి వెల్లడించారు.  దుబాయ్ ఇంటర్నేషనల్ (డిఎక్స్‌బి) నుంచి చెన్నైకి వెళ్లాల్సిన ఫ్లైదుబాయ్ విమానాన్ని (ఎఫ్‌జెడ్-449) బెంగళూరుకు మళ్లించారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. నివాసితులు చెన్నైకి ప్రయాణ ప్రణాళికలను రద్దు చేయాల్సి వచ్చిందని, మరికొందరు విమాన రద్దు కారణంగా నగరంలో చిక్కుకుపోయారని పేర్కొన్నారు. తీవ్ర తుఫాను మైచాంగ్ తీరాన్ని తాకడానికి తమిళనాడు, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తమిళనాడులోని నాలుగు కోస్తా జిల్లాల్లో అధికారులు సెలవు ప్రకటించారు. రాజధాని నగరం చెన్నైలోని ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com