సిల్క్‌స్మిత అవతారమెత్తిన బాలయ్య హీరోయిన్.!

- December 05, 2023 , by Maagulf
సిల్క్‌స్మిత అవతారమెత్తిన బాలయ్య హీరోయిన్.!

నందమూరి నటసింహం బాలకృష్ణ సరసన ‘వీర సింహారెడ్డి’ సినిమాలో నటించిన ముద్దుగుమ్మ గుర్తుందిగా.! హనీ రోజ్ అనుకునేరు. కాదు కాదు, ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ వుంది. ఆ స్పెషల్ సాంగ్‌లో హనీ రోజ్‌తో పాటూ, మరో ముద్దుగుమ్మ కూడా బాలయ్యతో కలిసి నర్తించింది.

ఆమె మరెవరో కాదు, చంద్రిక రవి. ఆమె ప్రధాన పాత్రలో ఓ బయోపిక్ రూపొందుతోంది. ఇండియన్ సిల్వర్ స్ర్కీన్‌పై ఓ సంచలనమైన సిల్క్ స్మిత బయోపిక్ తెరకెక్కించాలని గత కొంత కాలంగా ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇన్నాళ్లకు ఆ ప్రయత్నాలు ఫలించాయ్. సిల్క్ స్మిత పాత్రలో కరెక్ట్‌గా సరిపోయే నటి దొరికింది మేకర్లకు. ఆమెనే ఈ చంద్రిక రవి. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చంద్రిక రవిని చూసి అంతా షాకయ్యారు. అచ్చు గుద్దినట్లు సిల్క్ స్మితలానే. కాదు, కాదు, సిల్క్ మళ్లీ పుట్టిందా.? అన్నట్లుగా అతికిపోయింది ఆమె పాత్రలో.

అందుకేనేమో, వెంటనే బయోపిక్‌ని స్టార్ట్ చేసేస్తున్నారు. జయరామ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే మిగిలిన వివరాలు వెల్లడి కానున్నాయ్. కాగా, విద్యా బాలన్ ప్రధాన పాత్రలో ‘డర్టీ పిక్చర్’ అనే సినిమా కూడా సిల్క్ బయోపిక్‌గానే రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా అప్పట్లో ఓ సంచలనమే. చూడాలి మరి, చంద్రిక రవి.. సిల్క్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఎన్ని సంచలనాలకు వేదికవుతుందో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com