మహానటీ.! నీ జాడేదీ.!
- December 05, 2023
కీర్తి సురేష్ పనైపోయిందా.? ఒక్క ఫ్లాప్ ఆమెని ఫేడవుట్ హీరోయిన్ని చేసేసిందా.? లేదు లేదు తెలుగు ఆడియన్సే కీర్తి సురేష్‌ని లైట్ తీసుకుంటున్నారా.? అబ్బో..! ఇలాంటి బోలెడన్ని ప్రశ్నలు మహానటి చుట్టూ.
‘దసరా’తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ‘వెన్నెల’ పాత్రతో మరోసారి సినీ ప్రియుల్ని తన మయాజాలంతో ఆకట్టుకుంది కీర్తి సురేష్. ఆ తర్వాత వద్దన్నా వినకుండా ‘భోళా శంకర్’ సినిమా ఒప్పుకుంది.
అయితే, మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసే అవకాశం ఊరికే ఎవరైనా వదులుకుంటారా.? చెప్పండి. ఎవరో సాయి పల్లవి లాంటి వాళ్లు తప్ప. అయితే సినిమా హిట్ అయితే వేరే లెవల్ వుండేది. కానీ, ‘భోళా శంకర్’ ప్రయత్నం బెడిసికొట్టింది. దాంతో, కీర్తి సురేష్ సైడ్ అయిపోయింది.
ప్రస్తుతం తెలుగులో కీర్తి సురేష్ సైన్ చేసిన సినిమాలేమీ లేవు. కానీ, తమిళంలో మాత్రం కీర్తి సురేష్ బిజీగానే వుంది. నాలుగు ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా షూటింగులకు హాజరవుతోంది. అందులో రెండు హీరోయిన్ సెంట్రిక్ సినిమాలే కావడం విశేషం.
‘మహానటి’గా తన కీర్తిని పతాక స్థాయికి తీసుకెళ్లిన కీర్తి సురేష్‌కి ‘భోళా శంకర్’ ఓ మైనస్సే అని చెప్పొచ్చు. అయినా కీర్తి మహానటి కదా.. ఎప్పుడైనా పుంజుకోవచ్చు. లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!