ఖర్గే నివాసంలో ముగిసిన సమావేశం..

- December 05, 2023 , by Maagulf
ఖర్గే నివాసంలో ముగిసిన సమావేశం..

న్యూ ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి వ్యవహారం ఢిల్లీ చేరిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం ముగిసింది. ఖర్గే నివాసంలో జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే పాల్గొన్నారు. దాదాపు అరగంట పాటు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపిన ఏకవాక్య తీర్మానాన్ని అధిష్టానానికి డీకే అందజేశారు. సమావేశం ముగిసిన వెంటనే ఖర్గే నివాసం నుంచి రాహుల్, కేసీ వేణుగోపాల్ వెళ్లిపోయారు. మరికాసేపట్లో డీకే శివకుమార్ హైదరాబాద్‌కు బయలుదేరి రానున్నారు. అధిష్టానం నిర్ణయించిన సీఎం అభ్యర్థి పేరును డీకే హైదరాబాద్‌లో ప్రకటించనున్నారు. ఇప్పటికే సీఎం అభ్యర్థిపై హైకమాండ్‌ క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం అభ్యర్థి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో, డీకే శివకుమార్ ఈ సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. సీఎల్పీ సమావేశంలో డీకే శివకుమార్ సీఎం పేరును ప్రకటించనున్నారు. మిగిలిన పదవుల కేటాయింపుపైనా నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఖర్గేతో భేటీకి ముందు ఉత్తమ్‌ కుమార్, భట్టి విక్రమార్కతో డీకే, ఠాక్రేలతో వేర్వేరుగా చర్చలు జరిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com