దోహా 2024 ప్రపంచ ఆక్వాటిక్స్ ఛాంపియన్‌షిప్‌.. వాలంటీర్ అప్లికేషన్‌లకు ఆహ్వానం

- December 06, 2023 , by Maagulf
దోహా 2024 ప్రపంచ ఆక్వాటిక్స్ ఛాంపియన్‌షిప్‌.. వాలంటీర్ అప్లికేషన్‌లకు ఆహ్వానం

దోహా 2024 ప్రపంచ ఆక్వాటిక్స్ ఛాంపియన్‌షిప్‌.. వాలంటీర్ అప్లికేషన్‌లకు ఆహ్వానం
దోహా: వరల్డ్ ఆక్వాటిక్స్ ఛాంపియన్‌షిప్స్ – దోహా 2024 వాలంటీర్ అప్లికేషన్‌లు అధికారికంగా ప్రారంభమయ్యాయి. 2024 ఫిబ్రవరి 2- 18తేదీల మధ్య ప్రపంచ ఆక్వాటిక్స్ ఫ్లాగ్‌షిప్ ఈవెంట్ మొదటిసారిగా మిడిల్ ఈస్ట్‌లో నిర్వహించబడుతుంది. ప్రపంచంలోని అత్యుత్తమ ఆక్వాటిక్స్ అథ్లెట్లు ఖతారీ రాజధానికి వెళ్లి ఆరు వేర్వేరు ఆక్వాటిక్ క్రీడలలో మూడు ప్రపంచ స్థాయి వేదికలలో పోటీ పడనున్నారు.

దోహా 2024 ఆర్గనైజింగ్ కమిటీ స్థానికంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక వాలంటీర్లుగా చేరాలని పిలుపునిస్తోంది. సుమారు 1000 మంది వాలంటీర్లు అవసరం ఉంటారని తెలిపారు. వాలంటీర్లు ఫిబ్రవరి 23 మరియు మార్చి 3 మధ్య జరిగే ప్రపంచ ఆక్వాటిక్స్ మాస్టర్స్ ఛాంపియన్‌షిప్‌లలో పని చేయడానికి కూడా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని దోహా 2024 డైరెక్టర్ జనరల్ ఖలీల్ అల్ జాబర్ అన్నారు.వాలంటీర్లు దోహా 2024లో పని చేయడానికి ఈ లింక్ ద్వారా లేదా http://www.worldaquatics-doha2024.comద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com