బాలయ్యతో ఊర్వశి.! భలే ఛాన్సులే.!
- December 06, 2023
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలాకి టాలీవుడ్లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయ్. అయితే, అవన్నీ జస్ట్ స్పెషల్ సాంగ్ ఆఫర్లే. బాబీ - మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా కోసం ఐటెమ్ సాంగ్లో నటించింది ఊర్వశి రౌతెలా.
ఆ తర్వాత యంగ్ హీరో రామ్ పోతినేని సరసన ‘స్కంధ’లోనూ ఐటెం సాంగ్ చేసింది. మరిన్ని ఐటెమ్ సాంగ్స్ ఆఫర్లు వస్తున్నాయట ఊర్వశి రౌతెలాకి.
తాజాగా బాబీ డైరెక్షన్లో బాలయ్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనూ ఓ అదిరిపోయే మాస్ ఐటెం సాంగ్ వుందట. ఆ సాంగ్లో ఊర్వశి నటిస్తోందనేది తాజా సమాచారమ్.
అయితే, ఈ సినిమాలో ఊర్వశి ఓన్లీ ఐటెమ్ సాంగే కాదు, కొన్ని సీన్లలోనూ కనిపించబోతోందనీ తెలుస్తోంది. ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా ప్రమోషన్లలో ఊర్వశి చాలా యాక్టివ్గా పాల్గొంది. అలా డైరెక్టర్ బాబీతో మంచి స్నేహం కుదిరింది ఊర్వశికి.
ఆ చనువుతోనే మళ్లీ బాలయ్య సినిమాలోనూ ఛాన్సిచ్చాడనీ.. అయితే, ఈ సారి కొంత నిడివి గల పాత్ర కూడా ఆఫర్ చేశాడనీ తెలుస్తోంది. చూడాలి మరి, ఈ ప్రచారంలో నిజమెంతో.! ఒకవేళ నిజమే అయితే, హీరోయిన్ మెటీరియల్ అనిపించుకున్న ఊర్వశి కోరిక కొంతైనా తీరినట్లవుతుంది.
తాజా వార్తలు
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!