2024 బడ్జెట్‌ను ఆవిష్కరించిన సౌదీ అరేబియా

- December 08, 2023 , by Maagulf
2024 బడ్జెట్‌ను ఆవిష్కరించిన సౌదీ అరేబియా

రియాద్: సౌదీ అరేబియా 2024 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర సాధారణ బడ్జెట్‌ను బుధవారం ఆవిష్కరించింది. మొత్తం ఆదాయాలు SR1,172 బిలియన్లు, ఖర్చులు SR1,251 బిలియన్లుగా పేర్కొంది. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ అధ్యక్షతన జరిగిన మంత్రుల మండలి ప్రత్యేక సమావేశం ఆమోదించిన బడ్జెట్, SR79 బిలియన్ల లోటును అంచనా వేసింది. అభివృద్ధి, సామాజిక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో సహా బడ్జెట్ ప్రతిపాదనలను అమలు చేయడంలో చురుగ్గా పాల్గొనాలని మంత్రులు, సీనియర్ అధికారులను రాజు సల్మాన్ ఆదేశించారు. యువరాజు, ప్రధాని మహమ్మద్ బిన్ సల్మాన్ సమక్షంలో కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఏడాది సెప్టెంబర్ 30న 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రీ-బడ్జెట్ ప్రకటనను వెల్లడించడం గమనార్హం. మొత్తం ఖర్చులు SR 1,251 బిలియన్లు, మొత్తం ఆదాయాలు SR 1,172 బిలియన్లుగా పేర్కొన్నారు. మంత్రిత్వ శాఖ స్థూల దేశీయోత్పత్తి (GDP)లో దాదాపు 1.9 శాతం వద్ద స్వల్ప లోటును అంచనా వేసింది. ఇది ప్రభుత్వ ఆదాయాలను స్థిరీకరించడానికి,  స్థిరమైన ఆర్థిక వృద్ధిలో పెట్టుబడి పెట్టడానికి చేసిన ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com