అందరి కంటే ముందే నాగ్.! ‘నా సామిరంగ’ .!

- December 09, 2023 , by Maagulf
అందరి కంటే ముందే నాగ్.! ‘నా సామిరంగ’ .!

నాగార్జున తాజా మూవీ ‘‘నా సామి రంగ’. ఈ సినిమాని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు నాగార్జున. సంక్రాంతి బరిలో ఈ సినిమా వుండబోతున్నట్లు ఆల్రెడీ మేకర్స్ ఓ హింట్ ఇచ్చేశారు. అయితే, సంక్రాంతి బరిలో ఇప్పటికే పెద్ద సినిమా ‘గుంటూరు కారం’ రిలీజ్‌కి సిద్ధంగా వుంది.

అలాగే, వెంకటేష్ కూడా ‘సైంధవ్’ సినిమాతో సిద్ధంగా వున్నారు. మరికొన్ని సినిమాలు సంక్రాంతి బరిలో నిలవగా.. తాజాగా నాగార్జున వాళ్లందరి కంటే ముందే ఫ్యాన్స్‌కి సంక్రాంతి పండగను తీసుకొచ్చేయబోతున్నారట.

జనవరి 10, లేదా 11 తేదీల్లో ‘నా సామిరంగ’ సినిమాని రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 12 వ తేదీన మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే 13న వెంకటేష్ ‘సైంధవ్’గా రానున్నారు.

ఇక, నాగార్జున 10, లేదా 11 తేదీలను లాక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ టార్గెట్ రీచ్ అయ్యేలానే సినిమాని శరవేగంగా పూర్తి చేస్తున్నారట. ఈ సినిమాలో ఆషికా రంగనాధ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఈ నెల 10 వ తేదీన ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు.

అన్నట్లు ఈ సినిమాకి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన కీరవాణి సంగీతమందించడం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com